Animal Movie : యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఆ రేంజ్ లో వచ్చాయా?
TeluguStop.com
సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్( Animal Movie )కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా డిసెంబర్ 1న విడుదలైన విషయం తెలిసిందే.
మరి తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ.200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.
అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000 లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారట.
5 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, తమిళంలో రూ.
40 లక్షలు, కర్నాటక( Karnataka )లో రూ.9 లక్షలు, కేరళలో రూ.
1 లక్షలతో కలిపి మొదటి రోజే ఈ సినిమాకు రూ.61 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది.
"""/" /
వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే యానిమల్ మూవీకి ఇండియాలో రూ.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
అలాగే, రణ్‌బీర్ కపూర్( Ranbir Kapoor )కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు.
దీంతో ఈ చిత్రాన్ని అంతటా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.ఇక మొదటి రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్లను 33 కోట్లు వసూలు చేసింది.
వీటితో కలిపితే ఫస్ట్ డే రూ.103 కోట్లు గ్రాస్ రాబట్టింది.
కాగా ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.రూ.
210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఇది రూ.
61 కోట్లు రాబట్టింది. """/" /
అంటే ఇంకా రూ.
149 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే టార్గెట్ ను రీచ్ కావడం అన్నది పెద్ద సంగతి ఏం కాదు అని తెలుస్తోంది.
ఇవాళ రేపు వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!