స్టార్ హీరో రామ్ చరణ్ ( Ram Charan )హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ( game changer movie )బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో రన్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ ప్రచారం జరగడం ఈ సినిమాకు మైనస్ అయింది.
సంక్రాంతి సినిమాలలో మొదట విడుదలైన సినిమా గేమ్ ఛేంజర్ కాగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
ప్రేక్షకులను ఈ సినిమా ఒకింత నిరాశపరిచింది.
అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.గేమ్ ఛేంజర్ విషయంలో మ కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉందని వెల్లడించారు.
ఈ సినిమాకు పని చేసిన వాళ్లందరికీ అభినందనలు అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞుడినని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ అని ఆయన కామెంట్లు చేశారు.మీరు గర్వపడే ప్రదర్శనను కొనసాగిస్తానని పాజిటివ్ ఎనర్జీతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా హామీ ఇస్తున్నానని రామ్ చరణ్ వెల్లడించారు.
రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాకు ఇప్పటివరకు 85 కోట్ల రూపాయలకు( Rs 85 crore ) పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.ఫుల్ రన్ లో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్స్ తో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.