బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసినందుకు మేకర్స్ ప్లాన్ చేశారు, తెలుగు ట్రైలర్ ని ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించిన విషయం తెలిసిందే.
దాంతో తెలుగు లో మంచి బజ్ క్రియేట్ అయింది అనడం లో సందేహం లేదు.ఇక షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఉత్తరాదిన ఇప్పటికే సంచలన అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ పబ్లిసిటీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకునే విధంగా సినిమా యొక్క విజువల్స్ కూడా యాక్షన్ సినీ ప్రియులను అలరించే విధంగా ఉండడంతో వాటికి తోడు రామ్ చరణ్ ప్రమోట్ చేయడం తో అంచనాలు మరింతగా పెరిగాయి.
రామ్ చరణ్ వంటి స్టార్ హీరో పబ్లిసిటీ తో కచ్చితంగా పఠాన్ సినిమా కు కలిసి వస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి తో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇతర భాషల హీరో లకు తెలుగు లో మార్కెట్ లేనప్పుడు రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ముందు ఉండి నడిస్తే ఖచ్చితంగా ఆ సినిమా కి మంచి సక్సెస్ దక్కే అవకాశాలు ఉన్నాయి.మరి పఠాన్ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.రామ్ చరణ్ ముందుండి నడిపించినందుకు పఠాన్ కు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా కూడా పఠాన్ సినిమా కు దీపిక పడుకునే యొక్క బికినీ సన్నివేశం కారణంగా మంచి పాపులారిటీ లభించింది.అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.