Ram Charan : రామ్ చరణ్ కారును ఫాలో అయిన ఫ్యాన్స్.. చరణ్ చేసిన పని తెలిస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

మామూలుగా హీరో హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు అభిమానులు వెంట పడడం సెల్ఫీలు అడగడం ఆటోగ్రాఫ్ లు అడగడం లాంటివి చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు కొంతమంది అభిమానులు సెలబ్రిటీలను( Celebrities ) ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు.

 Ram Charan Fans Follwed His Car Here Is The Reaction-TeluguStop.com

అలాంటప్పుడు కొంతమంది సెలబ్రేట్ లు వెంటనే అభిమానులపై సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు.నవ్వుతూ చెబుతూ వారిని పలకరిస్తూ ఉంటారు.

తాజాగా కూడా హీరో రామ్ చరణ్( Hero Ram Charan ) అలాంటి పని చేశారు.రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా( game changer movie ) షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తేజ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకుని వస్తున్న రామ్ చరణ్ కారును వెంబడించారు.ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన నేపథ్యంలో కారును స్లో చేయించిన రామ్ చరణ్ వారందరికీ అభివాదం చేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.అయితే తాము వెళుతుంటే మరింత స్పీడ్ పెంచి రామ్ చరణ్ కారు ముందుకు తీసుకువెళతారు అనుకుంటే కారు స్లో చేయించి తమను పలకరించడంతో అభిమానుల షాక్ అయ్యారు.

ప్రస్తుతం రామ్ చరణ్,శంకర్ ల కాంబోలో గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు.అయితే మధ్యలో ఇండియన్ 2 షూటింగ్ కూడా శంకర్ చేయాల్సి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్రస్తుతానికి డెడ్ లైన్ గా పెట్టుకుని సినిమా యూనిట్ కష్టపడుతోంది.

అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube