ఏకంగా 27 అడుగుల రాఖీ.. ఎవరికో తెలిస్తే ఆశ్చర్యపోతారు

త్వరలో రాఖీ పండుగ ( Rakhi festival )రాబోతుంది.దీంతో మార్కెట్‌లోకి రాఖీలు వస్తున్నాయి.

 Rakhi Of 27 Feet Together If Anyone Knows, They Will Be Surprised , 27 Feet, Rak-TeluguStop.com

విభిన్నమైన రకాల డిజైన్లతో రకరకాల రాఖీలు మార్కెట్ లో కనువిందు చేస్తున్నాయి.వివిధ రాకల డిజైన్లతో తయారుచేసిన రాఖీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

రాఖీలు వివిధ డిజైన్లలో లభిస్తాయి.డిజైన్ ను బట్టి కొన్ని ఎక్కువ ధర ఉంటే, మరికొన్ని తక్కువ ధరలలో లభిస్తాయి.

అలాగే వివిధ ఆకారాలు, రంగులతో కూడా రాఖీలను తయారుచేస్తూ ఉంటాయి.భారత త్రివర్ణ పతాకం( Indian tricolor flag ) రంగులలో కూడా రాఖీలు ఉంటాయి.

Telugu Feet, Rakshi, Latest-Latest News - Telugu

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ( Bilaspur, Chhattisgarh )సైనికులకు పంపించేందుకు విభిన్న డిజైన్ తో రాఖీలను తయారుచేశారు.సాయిమయౌళి ఆలయ కమిటీ సైనికులకు పంపేందుకు ప్రత్యేకమైన రాఖీలను తయారుచేయించింది.పంజాబ్‌లోకి ఉధంపూర్ సైనికులకు పంపేందుకు 27 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో రాఖీ రూపొందించారు.ఈ రాఖీలో 21 మంది వీరజవాన్ల ఫొటోలు వచ్చేలా తయారుచేశారు.

బిలాస్‌పుర్ జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు అధికారుల ద్వారా వీటిని రోడ్డు మార్గంలో ఉధంపుర్‌కు తరలించారు.

Telugu Feet, Rakshi, Latest-Latest News - Telugu

గత ఏడాది కూడా ఇదే ఆలయ కమిటీ 15 అడుగుల పొడవైన రాఖీని లద్దాఖ్ లోని జవాన్లకు పంపించింది.దేశ జవాన్లు తమ ఇంటి నుంచి రాఖీ అందినట్లు అనుభూతి పొందేలా ప్రత్యేక రాఖీలను పంపిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు.ఈ రాఖీలు చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి.

కలర్‌ఫుర్ డిజైన్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.జవాన్లకు పండుగులు అంటూ ఏమీ ఉండవు.

కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం బోర్డర్ లో కాపలా కాస్తూ ఉంటారు.ఎండ, వాన, చలిని తట్టుకుంటూ సరిహద్దుల్లో రక్షణగా ఉంటారు.

దీంతో జవాన్లకు చాలా సంస్థలు రాఖీలు పంపుతూ ఉంటాయి.అందులో భాగంగా సాయిమమౌళి ఆలయ కమిటీ ప్రతి ఏడాది జవాన్లకు వినూత్న డిజైన్లతో కూడిన రాఖీలు పంపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube