కరోనాపై పోరు.. ఫండ్ రైజింగ్ కోసం: 73 ఏళ్ల వయసులో తాతయ్య స్కిప్పింగ్

మానవాళి మనుగడకే పెను సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిపై పోరులో డాక్టర్లు, వైద్యసిబ్బందిది కీలకపాత్ర.ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ రోగుల జీవితాలను నిలబెట్టేందుకు వెనక్కి తగ్గడం లేదు.

 73 Year Old Skipping Sikh Is Raising Money For British Nhs To Fight Coronavirus,-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బందికి తోడ్పాటును అందించడానికి పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం లండన్‌కు చెందిన 99 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ వైద్య సిబ్బందికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన అనారోగ్యాన్ని, వయసును సైతం లెక్కచేయకుండా గార్డెన్‌లో వాకింగ్ చేసి నిధులు సేకరించాడు.

తన ఇంటి ఆవరణలో 25 మీటర్ల దూరాన్ని 100 సార్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.పెద్దాయనను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పలువురు ముందుకు రావడంతో సుమారు 12 మిలియన్ పౌండ్లు పోగయ్యాయి.

Telugu Sikhbritish, British Nhs, Coronavirus-

ఆయననే స్ఫూర్తిగా తీసుకున్న భారత సంతతికి చెందిన 73 ఏళ్ల రజిందర్ సింగ్ ‌స్కిప్పింగ్‌ ఆడి నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దక్షిణ ఇంగ్లాండ్‌లోని బెర్క్‌షైర్‌లో నివసిస్తున్న సింగ్ లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తున్నారు.కరోనా సోకకుండా మనకి మనం జాగ్రత్తగా ఉండటంతో పాటు ఇతరులకు మన వల్ల వైరస్ రాకుండా చూసుకోవాలని రజిందర్ సింగ్ అంటున్నారు.

చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరిచే ఆయన ఈ విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు ఏదైనా చేయాలని భావించారు.

దీనిలో భాగంగా వాటర్ క్యాన్లు ఎత్తడం, రన్నింగ్, వాకింగ్, వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.ఆ వయసులో కుమార్తెతో కలిసి పరుగు పందెంలో పాల్గొన్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

ప్రస్తుత పరిస్ధితుల్లో నేషనల్ హెల్త్ సర్వీస్‌ సేవలు వెలకట్టలేనివని.అందువల్ల తన కుమార్తె సాయంతో విరాళాల సేకరణ మొదలుపెట్టానని సింగ్ చెప్పారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube