ఇండియాలో ఎన్టీఆర్ లా మరెవరూ యాక్ట్ చేయలేరన్న జక్కన్న.. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా?

సినిమా రంగంలో నంబర్ వన్ యాక్టర్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతూ ఉంటుంది.వరుసగా ఇండస్ట్రీ హిట్లు సాధించడంలో చాలామంది హీరోలు విఫలమవుతుండటంతో ఏ హీరో నంబర్ 1 యాక్టర్ అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం కష్టంగా మారింది.

 Rajamouli Shocking Comments About Ntr Goes Viral Details Here , Junoir Ntr, Ntr-TeluguStop.com

అయితే దర్శకధీరుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జక్కన్న తాజాగా ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కొమురం భీముడో సాంగ్ గురించి రాజమౌళి మాట్లాడుతూ ఆ సాంగ్ లో ఎన్టీఆర్ ఇచ్చిన హావభావాలను ఇండియాలో మరే యాక్టర్ ప్రదర్శించలేరని ఒకే షాట్ లో తారక్ అన్ని ఎమోషన్లను పండించారని రాజమౌళి తెలిపారు.

ఈ కామెంట్ చాలా పెద్ద కామెంట్ అయినప్పటికీ తారక్ ఆర్ఆర్ఆర్ లో అంత అద్భుతంగా నటించాడని రాజమౌళి పేర్కొన్నారు.తారక్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా జక్కన్న కామెంట్లు చేశారు.

రాజమౌళి చేసిన కామెంట్లు తారక్ అభిమానులలో జోష్ ను నింపాయి.తారక్ రాజమౌళి కాంబినేషన్ లో భవిష్యత్తులో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జక్కన్న తలచుకుంటే మాత్రం ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందనడంలో సందేహం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

బీస్ట్ మూవీకి ఫ్లాప్ టాక్ రావడం ఆర్ఆర్ఆర్ కు ప్లస్ అవుతోంది.

Telugu Ntr, Rajamouli-Movie

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా షేర్ కలెక్షన్లను సాధిస్తోంది.కేజీఎఫ్2 సినిమా టాక్ పై ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.కేజీఎఫ్2 కూడా సక్సెస్ సాధించి సౌత్ సినిమాల క్రేజ్ ను మరింత పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.మరో 24 గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది.కేజీఎఫ్2 సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుండటంతో యశ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube