టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ నిన్నటి వరకు అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరిగింది.
అందుకు సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని చిత్ర యూనిట్ సభ్యులు రివీల్ చేసిన విషయం తెల్సిందే.తాజాగా చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి ఓటు వేసేందుకు వెళ్తున్నట్లుగా రాజమౌళి ప్రకటించాడు.

మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు పాల్గొన్న విషయం తెల్సిందే.భారీ యాక్షన్ సీన్స్‌ను జక్కన్న ప్లాన్ చేశాడు.అందుకోసం పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఉపయోగించారు.ఇక ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్స్ ను నిర్మించారు.
ప్రస్తుతం సినిమా స్థాయి ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చరణ్ మరియు ఎన్టీఆర్‌లు చాలా కొత్తగా ఈ చిత్రంలో కనిపిస్తారని తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లుగా ప్రకటించిన రాజమౌళి సామాజిక బాధ్యత అయిన ఓటు హక్కును తాను వినియోగించుకోబోతున్నట్లుగా ప్రకటించాడు.అందుకోసం తాను షూటింగ్ నుండి ఇంటికి వెళ్తున్నట్లుగా పేర్కొన్నాడు.రాజమౌళి ప్రతి ఒక్కరు బాద్యతగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చి మరోసారి తన గొప్పదనం చాటుకున్నాడు.