తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్ గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.