నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు( Telangana Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో రేపు బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణకు రాబోతున్నారు.మూడు రోజులపాటు 8 నియోజకవర్గాలలో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు.
అయితే రేపు తొలుత వారిద్దరూ వరంగల్ జిల్లాలో రామప్ప ఆలయం( Ramappa Temple )లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.సాయంత్రం ములుగులో నిర్వహించే సభలో పాల్గొంటారు.
తర్వాత ప్రియాంక గాంధీ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోనున్నారు.
అనంతరం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) రెండు రోజులపాటు తెలంగాణలో ఉండబోతున్నారు.
ఈ క్రమంలో బస్సు యాత్రలు చేపట్టాలని టీకాంగ్రెస్( T Congress ) నిర్ణయించింది.ఈ యాత్రలో నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు.చెరుకు రైతుల మహిళలతో భేటీ కానున్నారు.మొదట విడత బస్సు యాత్రలో తెలంగాణలో చాలా జిల్లాలలో రాహుల్ పర్యటించబోతున్నారు.
ఈ మొదట విడత బస్సు యాత్ర( Bus Yatra )లో కొన్నిచోట్ల రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా చేయబోతున్నారు.ముఖ్యంగా రైతులతో భేటీ కాబోతున్నారు.
దీంతో రేపు రాహుల్, ప్రియాంక గాంధీ రాబోతూ ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.