టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అంతేకాకుండా సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్ లకు, ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాలో సమంత సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన పాటను తాజాగా రిలీజ్ చేశారు.పుష్ప నుంచి రిలీజ్ అయిన ఊ అంటావా మావా.
ఊఊ అంటావా మావా.అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది.
ఈ పాట రిలీజ్ అయ్యిందో లేదో నెటిజన్స్ ఈ పాటను వివిధ రకాలుగా ఎడిటింగ్ లు చేస్తూ తెగ వాడేస్తున్నారు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాంగ్ కు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మీమ్స్ ను ఎడిట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ రీ ట్వీట్ చేశాడు.
హిలేరియస్, సూపర్ ఎడిటింగ్ చేశారు అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.
బ్రహ్మానందంతో పాటు హీరో ప్రభాస్ ను కూడా వాడేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.