50 కోట్ల క్లబ్ లో బేబీ.. ఫాస్టెస్ట్ సినిమాగా రికార్డ్.. నిర్మాత పోస్ట్ వైరల్!

బేబీ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.ఒక వైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న కూడా వాటిని లెక్కచేయకుండా బేబీ సినిమా( Baby movie )ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

 Producer Skn Post Baby's Blockbuster Success , Anand Devarakonda, Baby Movie, Bl-TeluguStop.com

చిన్న సినిమాలకు కూడా ఆదరణ పెరుగుతుంది అని బేబీ సినిమా రుజువు చేస్తుంది.కంటెంట్ బాగుండాలి కానీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు.

తాజాగా బేబీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అయ్యింది.

బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూ సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.

జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ తో పాటు వర్కింగ్ డేస్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా ఇంత రేంజ్ లో హిట్ అవ్వడంమే కాకుండా 50 కోట్ల క్లబ్ లోకి చేరడంతో నిర్మాత ఎస్కేఎన్ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా( Social media ) వేదికగా ఒక పోస్ట్ చేసారు.చాలా రోజుల తర్వాత 50 కోట్ల క్లబ్ లో అతి వేగంగా చేరిన చిన్న సినిమాగా బేబీ నిలిచింది అని మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదములు అంటూ చెప్పుకొచ్చారు.

మరి ఈ సినిమా వేగం చూస్తుంటే ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.8 రోజుల్లోనే 54 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఈ వారం కూడా అంతగా ఆకట్టుకునే సినిమాలు రిలీజ్ కావడం లేదు.దీంతో సెకండ్ వీక్ కూడా బేబీ హవానే కొనసాగనుంది.చూడాలి మరి ఈ సినిమా 100 కోట్ల మార్క్ చేరుకుంటుందో లేదో.కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.

విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube