సలార్ సినిమా విలన్ కి గాయాలు...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.ఆదిపురుష్ తాజాగా విడుదలవ్వగా ,నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ – కె , ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్( Salaar ) నటిస్తున్నారు .

 Prithviraj Sukumaran Injured On Sets Of Prabhas Salaar Movie Details, Prithviraj-TeluguStop.com

కెజిఫ్ సిరీస్ లతో తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ కు( Director Prasanth Neel ) బిగ్ ఫ్యాన్స్ అయిపోయారు .ప్రభాస్ తో నీల్ తప్పకుండా ఏదో మేజిక్ చేయబోతున్నారని గంపెడాశలు పెట్టుకున్నారు.నిజము చెప్పాలంటే ఆదిపురుష్ రిలీజ్ కి ముందు భారీ హైప్ వచ్చింది కానీ …

సినిమా పై అంతగా ఆశలు పెట్టుకోలేదన్నది మాత్రం వాస్తవం.ఇక సలార్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్- నీల్ లా సినిమా ఎప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నారు.

 Prithviraj Sukumaran Injured On Sets Of Prabhas Salaar Movie Details, Prithviraj-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఫాన్స్ బాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్( Prithviraj Sukumaran ) సలార్ లో విలన్ రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే .తాజాగా ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.ఆయ‌న ప్ర‌స్తుతం హీరోగా మలయాళ మూవీ విలాయత్ బుద్ధ లో నటిస్తున్నారు .ఇక కేర‌ళ‌లోని మ‌ర‌యూర్‌ బస్టాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తోండ‌గా ప్రమాద వశాత్తు గాయ‌ప‌డ్డాడు…

Telugu Prasanth Neel, Prabhas, Salaar, Salaar Villain, Varadarajmannar-Movie

పృథ్వీరాజ్ సుకుమారన్ కాలుకి దెబ్బ తగలగా .చిత్ర యూనిట్ వెంటనే ఆయన్ని కేర‌ళ‌లోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.గాయం తీవ్ర‌త‌ను ఎక్కువ‌గా ఉన్నందువల్ల పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చెబుతున్నారు.

మొత్తంగా అయన సర్జరీ తరువాత దాదాపుగా 3 నెలల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో అయన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు… ఆపరేషన్ సక్సెస్ అయ్యి.

త్వరగా పృద్విరాజ్ కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.సినీ ఇండస్ట్రీ వారు పృద్విరాజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికా గా కోరుకుంటున్నారు .తాజగా హీరో ప్రభాస్ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే పృద్విరాజ్ కి స్వయంగా ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారట.

Telugu Prasanth Neel, Prabhas, Salaar, Salaar Villain, Varadarajmannar-Movie

సినిమా అంటే సవాల్ లాంటింది.షూటింగ్ లో ఇలాంటివి అపుడపుడు ఎదుర్కోవాల్సి వస్తుందని .అపుడే మనం మరింత దైర్యంగా ఉండాలని చెప్పారట.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.పృథ్వి రాజ్ ఫాన్స్ ప్రభాస్ ఔన్నత్యానికి ఫిదా అవుతున్నారు.అలాగే తెలుగు ఫాన్స్ డార్లింగ్ ప్రేమ ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ పోలీస్‌, లూసిఫ‌ర్‌, జ‌న‌గ‌ణ‌మ‌న‌ , క‌డువా వంటి ప‌లు అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.

Telugu Prasanth Neel, Prabhas, Salaar, Salaar Villain, Varadarajmannar-Movie

మ‌ల‌యాళంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్‌లో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.బాలీవుడ్‌లోనూ అక్ష‌య్‌ కుమార్ హీరోగా చేస్తున్న భ‌డే మియా ఛోటా మియాలో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.ఇక మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా చేస్తున్న ఆడుజీవితం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.మరో వైపు తెలుగులో ప్రభాస్ నటిస్తున్న స‌లార్ సెప్టెంబ‌ర్ 28న విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో పృద్విరాజ్ సుకుమారన్ వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.డార్లింగ్ ప్ర‌భాస్ హీరోయిజంకు ధీటుగా పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌నిజం ఉండనుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube