సింగర్ మంగ్లీ ( Singer Mangli ) ప్రమాదానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే.ప్రతి ఏడాది పండుగకు ఒక కొత్త పాటను పాడి ఆ పాటకు వీడియోలు చేస్తూ మంగ్లీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా ఈ పాటల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా బోనాల ( Bonalu )పండుగ ప్రత్యేకంగా ఈమె ఓ పాట పాడి ఈ పాటకు వీడియో చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారంటూ వార్త వైరల్ గా మారింది.
ఈ విధంగా మంగ్లీ ప్రమాదానికి గురి కావడంతో వెంటనే తనని ఆసుపత్రికి తీసుకెళ్లగా పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారంటూ మంగ్లీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో మంగ్లీ సన్నిహితులు అభిమానులు పెద్ద ఎత్తున కంగారుతో ఈమెకు ఫోన్లు చేయడం కామెంట్ చేయడం జరిగింది.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై సింగర్ మంగ్లీ స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ నేను ప్రమాదానికి గురయ్యానని,కాలికి దెబ్బ తగిలింది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్ని పూర్తిగా ఆ వాస్తవమేనని( Fake News ) ఈమె కొట్టిపారేశారు.ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని అలాగే ఆ పాట షూటింగ్ కూడా చాలా అద్భుతంగా పూర్తి చేశామని మంగ్లీ తన గురించి వస్తున్నటువంటి ఈ ఫేక్ న్యూస్ స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.