Salaar : RRR ట్రైలర్ రికార్డ్ బద్దలు చేసిన సలార్… సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.త్వరలోనే ప్రభాస్( Prabhas )సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Prabhas Broke The Records Of Ntr And Ram Charan-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ట్రైలర్ (Trailer ) విడుదలైనటువంటి కేవలం ఒకరోజు వ్యవధిలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే ఈ ట్రైలర్ RRR సినిమా ట్రైలర్ ను బీట్ చేసిందని చెప్పాలి.

Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Ram Charan, Shruti Haasan, Tollywood-Mov

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైనటువంటి స్టార్ హీరోల సినిమాల ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ ఎన్ని గంటల వ్యవధిలో క్రాస్ చేశాయనే విషయానికి వస్తే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఒక మిలియన్ వ్యూస్ రావడానికి ఏకంగా 8: 49 నిమిషాల సమయం పట్టింది.భీమ్లా నాయక్13:49 మినిట్స్.వకీల్ సాబ్ 23:39 నిమిషాల సమయం పట్టింది. RRR సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ ఒక మిలియన్ వ్యూస్ సాధించడానికి ఏకంగా 7:43 నిమిషాల సమయం పట్టింది.

Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Ram Charan, Shruti Haasan, Tollywood-Mov

ఇక తాజాగా విడుదల చేసినటువంటి ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ మాత్రం RRR సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 6: 4 నిమిషాల వ్యవధిలోనే వన్ మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పాలి.ఇలా ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 22వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది అయితే డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Ram Charan, Shruti Haasan, Tollywood-Mov

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఇతర భాష స్టార్ హీరోలు కూడా ఇందులో భాగమవుతున్నారు.మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారు.జగపతిబాబు వంటి తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే కనుక సినిమా మరో రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నారు.

ఈమెకు ఇది ప్రభాస్ తో మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube