పుష్ప1 ఆంచనాలకు మించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.పుష్ప1 సినిమా సక్సెస్ కు ఆ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ కూడా కారణం కావడం గమనార్హం.భాషతో సంబంధం లేకుండా ఈ డైలాగ్ వల్ల బన్నీ కూడా పాపులర్ అయ్యారు.పుష్ప2 సినిమాలో కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం కష్టమైతే కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే పుష్ప2 సినిమా నుంచి తాజాగా పవర్ ఫుల్ డైలాగ్ లీకైంది.లీకైన ఈ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో పాటు సినిమాపై అంచనాలను అమాంతం రెట్టింపు చేయడం గమనార్హం.
ఈ నెల 16వ తేదీన అవతార్2 మూవీ రిలీజ్ కానుంది.భాషతో సంబంధం లేకుండా అవతార్2 మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం ఉండగా ఈ సినిమా రిలీజైన రోజున పుష్ప2 మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది.
పుష్ప2 మూవీ నుంచి “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చిందని అర్థం.
పులి నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం” అనే డైలాగ్ లీక్ అయింది.ఈ నెల 16వ తేదీన ఈ డైలాగ్ తోనే గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.పుష్ప2 సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మైత్రీ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పుష్ప2 సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ దాదాపుగా ఏడాది సమయం కేటాయించారంటే ఈ సినిమా స్క్రిప్ట్ ఏ విధంగా ఉండబోతుందో సులువుగా అర్థమవుతుంది.బన్నీ సైతం పుష్ప2 సినిమా రిలీజయ్యే వరకు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చెయ్యడానికి సిద్ధంగా లేరని సమాచారం అందుతోంది.పుష్ప2 మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.