జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు ప్రాజెక్ట్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా నుంచి గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపొయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ గ్లింప్స్ కు ఏకంగా 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.పవన్ 2024 ఎన్నికల సమయానికి ఏకంగా 4 సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని ( Nandini ) అనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ మొదటి భార్య మీడియాకు చాలా దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.1997 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందిని వివాహం జరిగింది.
2007 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందినికి విడాకులు ఇవ్వడం జరిగింది.నందిని స్వస్థలం వైజాగ్ కావడం గమనార్హం.ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే పవన్ కళ్యాణ్ నందిని విడాకులు తీసుకున్నారని సమాచారం.
నందిని తన పేరును మార్చుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉన్నారని బోగట్టా.
నందిని ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
నందిని పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె సంతోషంగా జీవనం సాగిస్తున్నారని సమాచారం.నందిని అప్పట్లో పవన్ కళ్యాణ్ పై పోలీస్ కేస్ నమోదు చేయడం జరిగింది.
సోషల్ మీడియాకు నందిని దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.