2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మీడియా, సోషల్ మీడియా ద్వారా వైసీపీ టార్గెట్ చేసింది.దీనిపై సంబంధించి ఐప్యాక్‌తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి పని చేశారు.
ఈ వ్వవహారంలో పార్టీకి సంబంధించిన కొందరు నేతలు కీలకంగా వ్వవహరించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ నామినేటెడ్ పదవులతో గౌరవించడం ప్రారంభించారు జగన్.
రాజకీయ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని, పోసాని, అలీ వంటి నటులు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.వారికి కీలకమైన నామినేటెడ్ పదవులతో ప్రభుత్వంలో గౌరవప్రదమైన హోదా ఇచ్చారు.
పదువులు రాని పార్టీలోని కొందరు నేతలకు ప్రతిఫలంగా ఆర్థిక సాయాన్ని అందించారు.
పార్టీ అధికార ప్రతి నిధులకు, స్పోక్ పర్సన్స్‌కు ప్రతి నెలా లక్షల రూపాయలు జీతం రూపంలో చెల్లించారు.
అందరికి న్యాయం చేసిన జగన్ తన సొంత సోదరి షర్మిలకు మాత్రం విస్మరించారు. నిజానికి జగన్ జైలుకు వెళ్లినప్పుడు అందరికంటే ఎక్కువగా కష్టపడింది షర్మిల.
జగన్ జైలుకెళ్లినప్పుడు వేల కిలోమీటర్లు నడిచిన ఆమె 2014, 2019 ఎన్నికలకు ముందు కూడా ప్రచారం చేశారు.కానీ జగన్ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది.
వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.దీనిపై రాజకీయ నిపుణులు అనేక రకాలుగా విశ్లేసిస్తున్నారు.

జగన్ ఇవ్వలేని పెద్దదైనా షర్మిల అడిగారా? లేక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మరో పవర్ సెంటర్ పుట్టుకొచ్చే అవకాశం ఉన్న షర్మిలకు ఏమైనా ఇవ్వడం పట్ల జగన్ అభద్రతా భావంతో ఆమెను పక్కకు పెట్టారా? అని అనేక లెక్కలు వేసుకుంటున్నారు.సోదురుడితో విభేదాల కారణంగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, వైఎస్సార్‌టీపీసీతో కొత్త పార్టీని స్థాపించారు.ప్రస్తుతం పాదయాత్ర, నిరసన కార్యక్రమాలతో అవకాశం దొరికినప్పడల్లా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.తాజాగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం మీడియాలో హైలెట్ గా నిలిచింది.