విజయ్ దేవరకొండ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పూజా వరుస సినిమాలలో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Pooja Hegde Learning Martial Arts For Vijaya Devarakonda , Pooja Hegde, Vijay De-TeluguStop.com

అయితే అయితే మొన్నటి వరకు వరుస హిట్స్ తో దూసుకు పోయిన ఈ ముద్దుగుమ్మకు ఈ ఏడాది మాత్రం అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.ఈమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాపులు అవ్వడంతో పూజా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే భారీగా హైప్ క్రియేట్ చేసిన ఈ మూడు సినిమాలు పూజా హెగ్డే ను అందనంత ఎత్తుకు తీసుకుపోతాయి అని అభిమానులు భావించారు.కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఊహించని విధంగా ఈ మూడు సినిమాలు కూడా డిజస్టర్ గా నిలిచాయి.

ఒకప్పుడు అయితే పూజా సినిమా ఓకే చేసింది అంటే ఆ సినిమా హిట్ అవుతుంది అనే విధంగా దర్శకులకు హీరోలకు సెంటిమెంట్ గా మారింది.కానీ ప్రస్తుతం మాత్రం ఆమెకు ఊహించని విధంగా ఇలా వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి.

Telugu Acharya, Beast, Martial, Pooja Hegde, Radhe Shyam, Tollywood-Movie

అయినప్పటికీ ఈ బుట్ట బొమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుతం ఈమె చేతినిండా పెద్దపెద్ద సినిమాలే ఉన్నాయి.అంతేకాకుండా పలు భారీ చిత్రాలలో సైతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా జనగణమన.

ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నేను హీరోయిన్ తో కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే.ఇందులో పూరి జగన్నాథ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు.

ఈ యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్ పూజ హెగ్డే నటించడం కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube