రంపచోడవరం నియోజకవర్గంలో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో కొనసాగించడం వివాదాస్పదంగా మారింది.ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో గడప గడపకు కార్యక్రమం.
దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో జరిగిన సభ వేదికపై అనంతబాబు ఫ్లెక్సీని అధికారులు ఏర్పాటు చేశారు.
హత్య కేసు ప్రధాన నిందితుడుగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనంతబాబు ఉన్నారు.
వై.సి.పి నుంచి సస్పెషన్ కు సైతం గురయ్యారు.గడపగడపకూ కార్యక్రమంలో అనంతబాబు ఫ్లెక్సీతో కార్యకర్తల ఊరేగింపు సైతం నిర్వహించారు.