Apple Vision Pro : రోబోకు యాపిల్ విజన్ ప్రో తొడిగిన వ్యక్తి.. దాని రియాక్షన్ చూస్తే..

టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల అమెరికాలో లాంచ్ చేసిన విజన్ ప్రో( Apple Vision Pro ) ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను ఆకట్టుకుంటుంది.దీనిని ధరిస్తే చాలు అది యూజర్లను వర్చువల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

 Pepper Robot Trying The Apple Vision Pro Reaction Video Viral-TeluguStop.com

రియల్ వరల్డ్ లోనే వర్చువల్ వరల్డ్ ను( Virtual World ) మిక్స్ చేసి ఇది అద్భుతమైన అనుభవాలను అందిస్తోంది.ఖరీదు చాలా ఎక్కువ అయినా వ్యక్తులు తెగ కొనేస్తున్నారు.

వీధిలో, రెస్టారెంట్లలో, బస్సుల వంటి వివిధ ప్రదేశాలలో పరికరాన్ని ఉపయోగించి వారి వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు.మానవుడు చేసిన ఈ ఇన్నోవేషన్ కి మానవుడే కాదు తాజాగా ఒక రోబో కూడా అబ్బుర పడింది.

ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో క్రియేటర్ తాజాగా విజన్ ప్రోను రోబో కళ్ళకు తొడిగాడు.ఈ రోబోను పెప్పర్( Pepper Robot ) అని పిలుస్తారు, ఇది మాట్లాడగలదు, కదలగలదు.చూడగలదు.ఇన్‌స్టా క్రియేటర్ విజన్ ప్రోను రోబో ముఖంపై పెట్టగా రోబో చాలా వింతగా ప్రవర్తించింది.రోబో కళ్లలో ఏదో అనూహ్యమైన దృశ్యాలు కనిపిస్తున్నాయన్నట్టు అది వెరైటీగా అటూ ఇటూ ఊగిపోయింది.బహుశా తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అది అంచనా వేయలేకపోయింది.

కొంతకాలం తర్వాత అది పనిచేయడం మానేసింది.వీడియో తీసిన వ్యక్తి రోబో “బగ్ అవుట్” అని చెప్పాడు.

యాపిల్ రీజన్ ప్రోలో కనిపించే ప్రపంచాన్ని చూసి రోబో బిత్తర పోయి ఉంటుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) 6 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌తో సూపర్ వైరల్ అయింది.ఈ వీడియోపై ప్రజలు భిన్నమైన స్పందనలను వ్యక్తం చేశారు.రోబో( Robot ) వింతగా రియాక్ట్ అవ్వడాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు కొంతమంది తమాషాగా భావించారు.

వారు వీడియోపై జోకులు చేశారు.కానీ కొంతమంది పరికరం నిజంగా విజన్ ప్రో కాదని గమనించారు.

ఇది స్కీయింగ్ కోసం వాడే గాగుల్స్ మాత్రమే అని అన్నారు.వీడియో తీసిన వ్యక్తి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడని, విజన్ ప్రోలా కనిపించేలా వైర్‌ను జోడించారని వారు తెలిపారు.

ఏది ఏమైనా ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube