బాబు విషయంలో పవన్ “యూ టర్న్”..ఇందుకేనా..   Pawan Kalyan Shocking Comments On TDP..Reason Is..     2018-03-15   01:31:52  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు…ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద బాంబు పెల్చారనే చెప్పాలి..ఎందుకంటే..నిన్నా మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి..చంద్రబాబు కి వచ్చే ఎన్నికల్లో కూడా సప్పోర్ట్ చేస్తారు మళ్ళీ జగన్ కి సీఎం అయ్యే చాన్స్ లేదు అనుకున్నారు..అయితే నిన్న పవన్ కళ్యాణ్ టిడిపి పై అధినేత చంద్రబాబు పై..అధినేత తనయుడు లోకేష్ పై టిడిపి నాయకులపై చేసిన కామెంట్స్ మాత్రం టిడిపి నేతల్లో అందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రసన ఒక్కటి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాడు..అసలేం జరిగింది..?

నాలుగేళ్ల నుంచి అవినీతి గురించి మాట్లాడని…’పవన్‌’ కి ఇప్పుడు టిడిపి లో అవినీతి ఎలా కనిపించింది..?అసలు ఈ అంశాన్ని ఎందుకు ఒక్కసారిగా ఎత్తుకున్నారు పవన్..అదే సమయంలో హోదా విషయం కానీ…రాష్ట్రానికి ‘మోడీ’ చేస్తోన్న అన్యాయం గురించి కానీ జగన్ మోడీ ములాఖత్ గురించి గానీ మాట్లాడలేదు…ఎటువంటి ఆధారాలు లేకుండానే మంత్రి ‘లోకేష్‌’పై ఎందుకు ఆరోపణలు గుప్పించారు..అయితే దీని వెనుకాల ఎవరో ఉండి కధ మొత్తం నడిపిస్తున్నారని మాత్రం బాగా తెలుస్తోంది..ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది కూడా..అయితే పవన్ వెనుక ఉంది ఇంత భారీ స్కెచ్ రచిస్తోంది ఎవరు అనే వివరాలలోకి వెళ్తే..రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నతమైన పదవులలో ఉన్న ఒక వ్యక్తి మరియు ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐ.వై.ఆర్‌.మరియు ఉండవల్లి వంటి వారు ఈ ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది..అంతేకాదు బీజేపి అధిష్టానం కూడా ఈ కుట్రలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పచ్చు అంటున్నారు..వీళ్ళందరూ కలిసి ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ చక చక చదివేశారు అని అర్థం అవుతోంది..

నిజానికి టిడిపి ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేయాలని ‘పవన్‌’ భావిస్తే..ఎప్పుడే చేయవచ్చునని..కానీ నాలుగేళ్ల పాటు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం విషయంలో చంద్రబాబు ఎంతో తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తుంటే పనిగట్టుకుని ప్రజల దృష్టిని మరల్చడానికి పవన్ ఈ వ్యఖ్యలు చేశారని అంటున్నారు..పవన్ వేసిన జేఎఫ్సీ బీజేపి ఏపీ కి ద్రోహం చేసిన అని తెలిచిన పవన్ నిన్న జరిగిన వేదికలో అస్సలు దానిపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడంతో ఈ వ్యవహారం అంతా బీజేపి ,వైసీపి లు కలిపే ప్లాన్ చేశాయని అర్థం అవుతోంది..అయితే ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల దృష్టి నుంచీ మరల్చడానికి బిజెపి పవన్ ని పావుగా వాడుకుంది అనడంలో సందేహం లేదు..