2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ కి మద్దతు ఇవ్వనున్నాడా.? చంద్రబాబు ని వేరు చేయడం ఈ గేమ్ ప్లాన్ లో భాగమేనా.? అంటే అవుననే అంటున్నారు వైసీపి ఎంపీ.వైసీపి ఎంపీ చెప్పడం ఏమిటి ఇది నిజమేగా అనుకుంటున్నారా ఎంత నిజం అయినా సరే ముందు వారి వారి నోటినుంచీ రావాలి కదా.అయితే ఇది నిజమేనంటూ వైసీపి ఎంపీ వరప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇంతకీ ఏమన్నారంటే.
కాసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడిన వైసీపి ఎంపీ వరప్రసాద్.అసలు విషయం వెల్లడించారు.‘జగన్” తోనే జనసేన వుంటుందంటున్నారు.అంతేకాదు పవన్ కి జగన్ కి మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్ళి కలిశారట.
వైకాపా తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నదని పవన్ అడిగినట్లు ఎంపి చెప్పారు.జనసేనను అవినీతి పార్టీ అని వైసిపి ఎందుకు ఆరోపణలు చేస్తున్నదని అడిగారట.
దానికి కూడా సమాధానం చెప్పారట.
మీరు “పోలవరం సందర్శనకు వైసిపి వెళ్తున్నదని తెలిసి కూడా మీరు ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే మీరు తెదేపాతో ఉన్నారని మీపై విమర్శలు చేశామ’ని చెప్పారట…దాంతో తెదేపాతో ఎంతమాత్రం లేనని, అవసరమైతే జగన్ కే మద్దతు ఇస్తాన’ని పవన్ చెప్పారని ఎంపి అన్నారు.
ఎన్నికల తరువాత జగన్ కు అవసరమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తామని హామీ ఇచ్చారట.ప్రత్యేక హోదా సాధన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన కలిసే పోరాటం చేస్తామని.
ఫ్యూచర్ అజెండా కూడా అదేనని అన్నారట.ఈ విషయాలన్నీ వరప్రసాద్ మీడియా ముందు వెల్లడించారు…ఇప్పుడు ఈ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి .ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.