హరిహర కాకుండానే పవన్‌ అది మొదలు పెట్టాడు ఏంటి?

పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాలేదు.ఎప్పుడెప్పుడు ఆ సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తాడా అంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Shooting Stopped Due To Harish Shankar Movie-TeluguStop.com

దర్శకుడు క్రిష్ దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు.ఆయన నుండి మరిన్ని సినిమాలు రావాలని కోరుకునే వారు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు వెంటనే పూర్తి అవ్వాలని ఆశ పడుతున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రారంభం అయినా ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.వరుసగా రెండవ రోజు ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లోనే పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ఒక వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయకుండానే మరో వైపు ఆ సినిమా ను మొదలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో కేవలం రెండున్నర నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Telugu Harihara, Krish, Pawan Kalyan, Tollywood-Movie

తమిళ సూపర్ హిట్ సినిమాకి ఈ సినిమా రీమేక్.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరగబోతుందని హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు ఈ సినిమా ను విడుదల చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది.హరిహర వీరమల్లు లో పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్ తో కనిపించబోతున్నాడు.కనుక ఆ సినిమా కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆరాట పడుతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube