పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఆ సమయం లో ఈ సినిమా ను ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు.నిన్న మొన్నటి వరకు ఈ సినిమాను అదే తేదీలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ రావడం లేదు.ఇంకా ఎన్నాళ్ళకు ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం లో ఒక స్పష్టత రాకపోవడం తో అభిమానుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
టిక్కెట్ల రేట్ల విషయం లో ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ అధికారికంగా జీవో మాత్రం ఇంకా ఇవ్వలేదు.
జీవో రాలేదు కనుక థియేటర్లలో పాత టికెట్ల రేట్లు కొనసాగుతున్నాయి.ఆ కారణంగా టికెట్ల రేట్లు ఈ విషయమై ఒక స్పష్టత వచ్చే వరకు విడుదలని వాయిదా వేసే విషయమై ఆలోచిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయిన తర్వాతనే ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంపు జీవోను విడుదల చేయాలని భావిస్తోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదంటే తన సినిమాని వాయిదా వేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా విడుదల విషయం లో నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ ఇవ్వాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.కానీ ఆయన నుండి ఎలాంటి క్లారిటీ మాత్రం రావడం లేదు.
సినిమా విడుదల ఎప్పుడో కానీ.సినిమా నుండి మరో పాటను విడుదల చేయబోతున్నట్లు గా మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఆ పాట ఎప్పుడు వస్తుంది అనేది త్వరలో డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.