ఢిల్లీలో టీ.కాంగ్రెస్ సీట్ల పంచాయతీ.. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీట్ల పంచాయతీ కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీకానుంది.

 Panchayat Of T. Congress Seats In Delhi.. Screening Committee Meeting Today-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కమిటీ చర్చించనుంది.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని నియోజకవర్గాల అభ్యర్థులపై నేతలు చర్చించే అవకాశం ఉంది.

అదేవిధంగా వామపక్షాలకు కేటాయించే స్థానాలపైనా కసరత్తు కొనసాగుతోంది.అలాగే రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

ఈ క్రమంలోనే అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube