నా కొడుకును శివాజీ కన్నకొడుకులా చూసుకున్నారు.. పల్లవి ప్రశాంత్ తండ్రి కామెంట్స్ వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) గత సీజన్లతో పోల్చి చూస్తే కొంచెం మెరుగ్గానే రేటింగ్స్ సాధిస్తోంది.బిగ్ బాస్ సీజన్7 ను హిట్ చేయడానికి ఈ షో నిర్వాహకులు ఎంతో కష్టపడగా ఆ కష్టానికి తగ్గ ఫలితం అంతోఇంతో కనిపిస్తోంది.

 Pallavi Prashanth Father Emotional Comments Goes Viral In Social Media Details-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) తండ్రి బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుతూ నా కొడుకును శివాజీ( Shivaji ) కన్నకొడుకులా చూసుకున్నారని అన్నారు.

పల్లవి ప్రశాంత్ తండ్రి కొడుకుకు ధైర్యం చెప్పడంతో పాటు పొలంలో పండించిన బంతిపూలను తీసుకొచ్చారు.గొడవలు పడవద్దని మంచిగా కలిసి ఉండాలని అమర్ దీప్ కు పల్లవి ప్రశాంత్ తండ్రి సూచనలు చేశారు.

పల్లవి ప్రశాంత్, ప్రశాంత్ తండ్రి కలిసి తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పారు.పల్లవి ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ టాలెంట్ ఉంది ఉపయోగించుకోవాలని కొడుకుకు సూచనలు చేశారు.

Telugu Biggboss, Shivaji-Movie

కొడుకును ఏడవవద్దని పల్లవి ప్రశాంత్ తండ్రి సూచనలు చేశారు. నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తుందని అమ్మకు బీపీ కూడా పెరుగుతుందని పల్లవి ప్రశాంత్ తండ్రి కామెంట్లు చేశారు.పల్లవి ప్రశాంత్ తన తండ్రి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు.నా బిడ్డను ఒక తండ్రిలా చూసుకున్నావని పల్లవి ప్రశాంత్ తండ్రి శివాజీని ప్రశంసించారు.బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు.

Telugu Biggboss, Shivaji-Movie

రైతుబిడ్డ అనే ట్యాగ్ పల్లవి ప్రశాంత్ కు ఎంతగానో ఉపయోగపడింది.బిగ్ బాస్ షోలోకి వెళ్లాలని ఎంతో కష్టపడిన పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు.బిగ్ బాస్7 తర్వాత పల్లవి ప్రశాంత్ సినిమాలతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube