దసరా సినిమా నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ ప్రోమో రిలీజ్.. మనసులను కదిలిస్తున్న సాంగ్?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా.ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

 Ori Vaari Song Promo Out From Nani And Keerthi Sureshs Movie Dasara Watch Video,-TeluguStop.com

మొదటిసారిగా నాని ఇందులో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.ఇందులో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

Telugu Dasara, Dhikshit Shetty, Keerthy Suresh, Nani, Ori Vaari, Sai Kumar, Samu

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.నాని లుక్కు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.ఇకపోతే నాని అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ధూమ్‌ధామ్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతోపాటుగా అన్ని భాషల్లో కూడా అలరిస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.

ఈ సెకండ్ సింగిల్ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 న విడుదల చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు.

Telugu Dasara, Dhikshit Shetty, Keerthy Suresh, Nani, Ori Vaari, Sai Kumar, Samu

తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.తాజాగా విడుదలైన ఓరి వారి సాంగ్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది.సినిమాలో హీరో స్లాంగ్ కి తగినట్టుగానే సాహిత్యం ఆలాపన ఉన్నాయి.

ఓరి వారి నీదు గాదుర పోరి.ఇడిసెయ్ రా ఇంగ.ఒడిసెను దారి అంటూ ఈ పాట సాగుతోంది.ఈ పాటను రేపు అనగా ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే దసరా సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube