ఆరెంజ్- పర్పుల్ క్యాప్ విజేతలకు కనక వర్షమే.. ప్రైజ్ మనీ ఎంతంటే..?

ఈ ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్ల అదృష్టంతా ఆరెంజ్ – పర్పుల్ క్యాప్( Orange – purple cap ) పైనే.ఆటగాళ్లంతా అద్భుత ఆటను ప్రదర్శిస్తూ ఉండడంతో ఈ రేసులో ఉండే ఆటగాళ్ల స్థానాలు రోజు మారుతూనే ఉన్నాయి.

 Orange Purple Cap Winners Have Rain How Much Prize Money, Orange - Purple Cap ,-TeluguStop.com

ఈ సీజన్లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి.ముందుగా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండే పోటీదారులను పరిశీలిస్తే, తొలి రెండు స్థానాలలో బెంగుళూరు జట్టు బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లేసిస్( Virat Kohli, Faf du Plessis ) నిలిచారు.

ఇక పర్పుల్ క్యాప్ రేసులో మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్( Mohammed Siraj, Rashid Khan ) పోటీ పడుతున్నారు.ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు ప్రైజ్ రూపంలో కనకవర్షం కురువనుంది.

ఈ ఐపీఎల్ సీజన్లో క్వాలిఫయర్ మ్యాచ్ మే 26న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ( Narendra Modi ) స్టేడియంలో జరగనుంది.ఇక ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరుగనుంది.

ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రైజ్ మనీ లు ప్రధానం చేస్తారు.ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉండే ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అవార్డుతో పాటు రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది.అలాగే పర్పుల్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉండే ఆటగాడికి పర్పుల్ క్యాప్ తో పాటు రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది.

అంతేకాకుండా వర్ధమాన ఆటగాడికి రూ.20 లక్షలు, సూపర్ స్ట్రైకర్ కు రూ.15 , ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడికి రూ.12 లక్షలు, ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి రూ.12 లక్షలు క్యాష్ ప్రైజ్ రూపంలో ఇవ్వనున్నారు.ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 422 పరుగులతో ఫాఫ్ డుప్లేసిస్ మొదటి స్థానంలో ఉన్నాడు.333 పరుగులతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు.తరువాత పర్పుల్ క్యాప్ రేసులో 14 వికెట్లు తీసి మహమ్మద్ సిరాజ్ మొదటి స్థానంలో, 14 తీసి రషీద్ ఖాన్ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube