దిశ చట్టంపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు.. హోంమంత్రి మేకతోటి సుచరిత

ప్రభుత్వ సంక్షేమ పథకాలు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ చేరుతున్నాయి అని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.

 Opposition Parties Are Spreading False Propaganda On The Direction Law Home Min-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజవర్గం పెనుమంట్ర మండలం లోని జుత్తుగ గ్రామంలో జరిగిన వివిధ శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.గ్రామంలో సీసీ రోడ్డులు, మనబడి నాడు-నేడు భవనం, గ్రామ సచివాలయంను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు.

కార్యక్రమములో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరగడానికి సీఎం జగన్ కారణమన్నారు.

ప్రతిపక్ష టీడీపీ నాయకులు కావాలనే దిశ చట్టం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు.రాష్ట్రంలో దాదాపు 46 లక్షల మంది వరకు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.

మహిళలపై జరిగే దాడులను టీడీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని హోంమంత్రి సుచరిత మండిపడ్డారు.అంతకు ముందు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సుచరిత తాడేపల్లిగూడెంలో పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి రంగారావుమంత్రి సుచరిత, ఆమె భర్త ఇన్ కం టాక్స్ కమిషనర్ దయాసాగర్ లను పుష్పగుంచెంతో స్వాగతం పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube