డోనాల్డ్ ట్రంప్ అసలు అధ్యక్షడు అవుతాడా లేదా అనుకున్న సమయంలో అనూహ్యంగా అధ్యక్ష పదవిని చేపట్టాడు.అప్పటి నుంచీ ట్రంప్ వ్యవహార శైలిలో ఎంతో మార్పు.
పభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమెరికాలో 60 శాతం ఉన్న జనాభాకి ఆ నిర్ణయాలు అస్సలు రుచించేవి కావట.ట్రంప్ నిర్ణయాలని వ్యతిరేకిస్తూ వచ్చేవారనియా తాజా అధ్యయనం లో తేలింది.
అసలు ట్రంప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే కోణంలో నిర్వహించిన పోల్ లో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ట్రంప్ అధ్యక్షత మాకొద్దు అని కోరుకుంటున్నవారిలో ఎక్కువమంది అమెరికన్లు ఉన్నారని తాజా పోల్ లో తేలింది ప్రజల్లో ఆయనకున్న ఆదరణ కన్నా వ్యతిరేకతకే అధిక ఓట్లు పోలయ్యాయి…అయితే గతంలో ట్రంప్‌కు ఎన్నికల ప్రచారంలో సహాయకుడిగా పనిచేసిన వ్యక్తికి శిక్ష పడడం, ట్రంప్ మాజీ న్యాయవాదిపై నేరారోపణలు నమోదైన నేపథ్యంలో ఈ పోల్ నిర్వహణ జరిగింది.ఈ పోల్ ని ఆగస్టు 26 నుండి నాలుగు రోజుల పాటు ఈ పోల్ నిర్వహించారు.
ట్రంప్ ని అధికారం నుంచీ తోలిగించేలా ఆయన ప్రజా వ్యతిరేక పనులు చేపట్టారా అనే దానికి 49శాతం ప్రజలు అవునని.46శాతం మంది లేదని తెలిపారు.ట్రంప్ వ్యవహార శైలి ఎలా వున్నా ఆయన పాలనను తాము సమర్థిస్తామని 36శాతం మంది చెప్పగా, రికార్డు స్థాయిలో 60శాతం మంది ఆయన పాలనను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు…గత ఏప్రిల్‌లో ట్రంప్‌కు ప్రజల్లో వున్న ఆదరణ 40శాతంగా వుండగా, వ్యతిరేకత 56శాతంగా వుంది.
నాలుగు నెలలు గడిచేసరికి వ్యతిరేకత ఇంకాస్త పెరిగి “60శాతానికి” చేరుకుంది.