జనసేన పార్టీ గూటికి చేరబోతున్న ఒంగోలు వైసీపీ ఎమ్యెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి..!

రానున్న రోజుల్లో జనసేన పార్టీ లోకి వైసీపీ నుండి భారీగా చేరికలు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.వైసీపీ లో బాగా పేరు మోసిన కొంత మంది నాయకులు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చాలా కాలం నుండి టచ్ లో ఉన్నారు.

 Ongole Ycp Mla Balineni Srinivas Reddy Who Is Going To Join Janasena Party , Paw-TeluguStop.com

ఆయన చిటిక వేస్తే పార్టీ లో చేరడానికి సిద్ధం గా ఉన్నారు.కానీ పొత్తు రీసెంట్ గానే ప్రకటించారు, కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆయన పార్టీలోకి వారిని ఆహ్వానించబోతున్నారని టాక్.

కేవలం కోస్తాంధ్ర లో మాత్రమే కాదు, రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల నుండి కూడా జనసేన పార్టీ లోకి వచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్ధం గా ఉన్నారు.ఇప్పటికే ప్రకాశం జిల్లాలో పార్టీ లో ఆమంచి స్వాములు అనే బలమైన నాయకుడు ఉన్నారు.

ఇప్పుడు మరో నేత కూడా జనసేన పార్టీ( Janasena party ) లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Telugu Ap, Janasena, Ongole, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

ఆయన మరెవరో కాదు ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎమ్యెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.( Balineni Srinivasa Reddy ) ఈయన గత కొంత కాలం నుండి వైసీపీ పార్టీ పట్ల అసంతృప్తి తో ఉన్నాడు.రాబొయ్యే ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలవడం అంత సులభమైన విషయం కాదని అధికారికంగా తెలిపాడు కూడా.

అంతే కాదు తనకి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను తక్షణమే వెనక్కి ఇస్తున్నట్టు గా అధికారికంగా ప్రకటించాడు.అంతే కాదు తన పై ఫేక్ డాక్యుమెంట్స్ కేసు లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బాలినేని చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నాడు.

నిర్దోషిని అయినా నన్ను ఇబ్బంది పెడుతూ అసలు దోషులను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు , ఈ కేసు లో వైసీపీ నాయకుల హస్తం ఉన్నా వదిలిపెట్టను అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నాడు.ఇలా ప్రతీ విషయం లోను ఆయన వైసీపీ పార్టీ పట్ల చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నాడు.

Telugu Ap, Janasena, Ongole, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

గత కొంతకాలం గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నాడు అనేది ఓపెన్ సీక్రెట్.ఇతనికి ఒంగోలు స్థానం ఖరారు చేస్తే వెంటనే పార్టీ లోకి వచేయడానికి సిద్ధంగా ఉన్నాడు.కానీ ఒంగోలు( Ongole ) స్థానం కష్టం అని, దర్శి స్థానం అయితే కచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను అని పవన్ కళ్యాణ్ నుండి మాట అందినట్టు సమాచారం.బాలినేని తన అనుచరులతో చర్చలు జరిపి చెప్తాను అన్నాడట.

పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా వారాహి విజయ యాత్ర సమయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube