చంద్రుడిపై మరోసారి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయింది.చంద్రునిపై రాత్రి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజ్ఞాన్ రోవర్ ను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపింది.
విక్రమ్ ల్యాండర్ తొలుత ల్యాండ్ అయిన ప్రాంతం నుంచి సుమారు 30 నుంచి 40 సెంటీమీటర్లు పక్కకు జరిగింది.ఈ క్రమంలోనే ఇంజిన్లను మండించుకుని జాబిల్లిపై మరో ప్రదేశంలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిందని ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ల్యాండింగ్ అయిన తరువాత ల్యాండర్ లోని నాలుగు పేలోడ్లు యథావిధిగా పని చేస్తున్నాయి.కాగా విక్రమ్ మరోసారి ల్యాండింగ్ అవడాన్ని హోప్ ఎక్స్ పెరిమెంట్ గా పిలుస్తున్నట్లు ఇస్రో పేర్కొంది.
ఈ హోప్ ఎక్స్ పెరిమెంట్ విజయంతో విక్రమ్ తన లక్ష్యాలను పొడిగించుకుంది.దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్ పరిశోధనలకు దారి దొరికిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జాబిల్లిపైకి మనుషులను పంపే భవిష్యత్ ప్రాజెక్టులపై విక్రమ్ ల్యాండర్ నమ్మకం కుదిర్చింది.