యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ సైతం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలవడంతో అందరిలో ముందు నుండి అంచనాలు పెరిగాయి.
ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తుండడం మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తి కాగా డిసెంబర్ తో మొత్తం పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.
మరి ఈ సినిమా నుండి ఒక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి విషయం ఏంటంటే.ఈ సినిమా నుండి ఈ ఏడాదిలోనే ఒక ట్రీట్ వస్తుందని చాలా రోజులుగా బజ్ వినిపిస్తూనే ఉంది.మరి ఈ ఏడాది మరో 10 రోజుల్లో పూర్తి కాబోతుంది.
దీంతో సినిమా నుండి ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.
మరి మేకర్స్ ఫ్యాన్స్ అభ్యర్ధనను పట్టించుకుంటారో లేదో చూడాలి.కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) నటిస్తుంటే.విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.