ఇటీవలే కాలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వారంతా దాదాపుగా దారుణ హత్యలకు గురయ్యారని పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.ఇందులో కూడా వివాహేతర సంబంధాల( Illegal Affairs ) కారణంగానే హత్యకు గురైన వారి సంఖ్య చాలా ఎక్కువ.
ఇలాంటి కోవలోనే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది.ఆమె కూతురు కనిపించడం లేదు.
అయితే వారం రోజులుగా మృతురాలి కూతురు స్కూల్ కి వెళ్లకపోవడంతో.స్కూల్ టీచర్ ఆమె ఇంటికి వచ్చి తలుపు తీయగా కుళ్ళిన స్థితిలో మృతి దేహం కనిపించింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కర్ణాటకలోని( Karnataka ) చామరాజ నగర జిల్లాలోని కోల్లేగాలలో 29 ఏళ్ల రేఖా( Rekha ) తన కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.రేఖా ఆరేళ్ల కూతురు మాన్విత( Manvita ) వారం రోజులుగా స్కూల్ కు రాకపోవడంతో.
స్కూల్ టీచర్ రేఖా కు ఫోన్ చేసింది.రేఖా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం స్కూల్ టీచర్ ఆదర్శ నగరలో ఉండే రేఖా ఇంటికి వెళ్లి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రేఖా మృతదేహం కనిపించింది.
స్కూల్ టీచర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా రేఖా బంధువులు పోలీసులను అడ్డుకున్నారు.
రేఖా ను హత్య చేసిన హంతకులను పట్టుకునేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించమని గొడవకు దిగడంతో పోలీసులు రేఖా బంధువులకు సర్ది చెప్పారు.

పోలీసులు రేఖా బంధువులను విచారించగా.కెఈబి లైన్ మెన్ నాగేంద్ర అలియాస్ ఆనందన్ కు( Nagendra Alias Anandan ) రేఖాకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం రేఖా భర్త సునీల్ కు తెలియడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.భర్త సునీల్ అడ్డు తొలగిపోయిన తర్వాత నాగేంద్ర కు చెందిన ఇంటిలో నివాసం ఉంటు, అతనితో రేఖా సహజీవనం చేసింది.
ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది.రేఖా ను హత్య చేసిన నాగేంద్ర, ఆమె కూతురు మాన్వితను తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేంద్ర,మాన్వితల కోసం గాలిస్తున్నారు.







