అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపున నామినేషన్ దక్కించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీపడగా వీరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు.
రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్స్ కోసం పోటీపడిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ), భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిలు పోటీలోంచి తప్పుకున్నారు.వీరిద్దరూ ట్రంప్‌కే మద్ధతు పలికారు.
దీంతో భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ( Nikki Haley ) ఒక్కరే ట్రంప్‌తో తలపడుతున్నారు.
ఇలాంటి దశలో నెవడా ఓటర్లు నిక్కీకి షాకిచ్చారు.రిపబ్లికన్ అభ్యర్ధిత్వం కోసం జరిగిన ప్రైమరీలో నిక్కీహేలీకి ప్రత్యర్ధులు ఎవరూ లేకపోయినా ఓటర్లు ఆమెను తిరస్కరించారు.నిక్కీకి ఓటు వేయకుండా ‘None of these candidates’ (భారతదేశంలో నోటా లాంటిది ) బటన్ నొక్కారు.
నిక్కీ హేలీకి 32 శాతం ఓట్లు రాగా.నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పోలై ఆమె ఓడిపోయారు.
ఇది అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.నెవడా రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వాల కోసం ప్రైమరీలు జరగాయి.
డెమొక్రాట్ పార్టీలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) విజయం సాధించగా.రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు పోటీ చేయలేదు.
నిక్కీ ఒక్కరే పోటీ చేశారు.కానీ ఆమెకు ఓటర్లు ఎవ్వరూ ఊహించని విధంగా షాకిచ్చారు.
నెవడా ప్రైమరీ ఫలితాల నేపథ్యంలో నిక్కీ హేలీపై ట్రంప్ సెటైర్లు వేశారు.నిక్కీకి ఇది బ్యాడ్ నైట్ అని.30 శాతం ఓట్లను నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్‌కు ఆమె కోల్పోయారని ఎద్దేవా చేశారు.మొత్తంగా నిక్కీ హేలీకి ప్రైమరీల్లో ఇది మూడో ఓటమి కావడం గమనార్హం.
ప్రెసిడెన్షియల్ డిబేట్స్‌లో పాల్గొనకపోయినా, ప్రైమరీల్లో పోటీ చేయకున్నా ఓటర్లు ట్రంప్‌ను ఆదరిస్తున్నారు.ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే.
ట్రంప్ అధికారికంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కావడం లాంఛనమే.