10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక కనిపించవు: TRAI

అవును, మీరు విన్నది నిజమే.TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) 10 అంకెల మొబైల్ నంబర్స్ ఆపేందుకు నిర్ణయం తీసుకుంది.

 10 అంకెల మొబైల్ నంబర్స్ ఇక కనిప-TeluguStop.com

అయితే, ఈ నిర్ణయం కేవలం 10 అంకెల మొబైల్ నంబర్స్ ఉపయోగించే టెలీ మార్కెటింగ్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది.వారిని అరాచకాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ట్రాయ్ అనుమతి లేకుండా ప్రమోషనల్ కాలింగ్ మరియు మెసేజీల కోసం 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించే వినియోగదారులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ చెబుతోంది.

ఇకపోతే టెలీ మార్కెటింగ్ కంపెనీలు 10 మొబైల్ నంబర్ల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే నంబర్స్ ను ఎక్కువగా వినియోగిస్తాయి.సాధారణంగా టెలీ మార్కెటింగ్ వాడే కాల్ నెంబర్స్ అనేవి సాధరణ వినియోగదారులు వాడే మొబైల్ నెంబర్లకంటే భిన్నంగా మరియు అర్ధమయ్యేలా ఉండేదుకు ప్రయత్నించాలి.అయితే, చాలా టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఈ నియమాలను తుంగలో తొక్కి, వారి ఇష్టానుసారం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్స్ ను ఉపయోగించి వారి ప్రమోషన్స్ ను షురూ చేస్తున్నాయి.

ఇక నుండి వారి ఆటలు సాగవని ట్రాయ్ నిర్ణయం చెప్పకనే చెబుతోంది.సాధరణ 10 అంకెల నంబర్ లతో యూజర్లను విసిగిస్తున్న టెలీ మార్కెటింగ్ కంపెనీల పైన ఇకనుండి ట్రాయ్ కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తద్వారా, టెలీ మార్కెటింగ్ కంపెనీలు ఆచరిస్తున్న ఈ అనైతిక పనులను ట్రాయ్ సమూలంగా నాశనం చేయాలని యోచిస్తోంది.ఈ విషయమై రిజిష్టర్ చెయ్యకుండా ప్రమోషనల్ కాల్స్ కోసం ఉపయోగించే నంబర్ లను వెంటనే ఆపివేయాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ ఆదేశాలు జారీచేసింది.

దీనికోసం, 30 రోజుల వ్యవధిని కంపెనీలకు ట్రాయ్ చివరి అవకాశంగా ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube