స్టాఫ్ ధనుష్ పై హీరోయిన్ కంప్లైంట్.. దొంగతనం చేశారు అంటూ?

ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సంజనా గల్రాని గురించి మనందరికీ తెలిసిందే.ఇంకా ఆమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా మనందరికీ సుపరిచితమే.

 Nikki Galrani Police Complaint Against Her Staff Dhanush, Nikki Galrani, Theft, Chennai, Kolywood, Sanjana Galrani-TeluguStop.com

నిక్కీ గల్రాని బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక కోలీవుడ్ లో డార్లింగ్, వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్‌, కడవుల్ ఇరుక్కన్‌ కుమారు, మొట్ట శివ కెట్ట శివ, హరహర మహాదేవకి, మరగత నానయం, సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాలతో నిక్కీ గల్రాని మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

 Nikki Galrani Police Complaint Against Her Staff Dhanush, Nikki Galrani, Theft, Chennai, Kolywood, Sanjana Galrani-స్టాఫ్ ధనుష్ పై హీరోయిన్ కంప్లైంట్.. దొంగతనం చేశారు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ గల్రాని తన ఇంట్లో దొంగతనం జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఆ దొంగతనం తన ఇంట్లో పనిచేసే వ్యక్తి చేసి ఉంటాడు అని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా జనవరి 11న నిక్కీ గల్రాని ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల ధనుష్ అనే ఓ యువకుడు నిక్కీ ఇంట్లో ఖరీదైన వస్తువులను దొంగతనం చేశాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిక్కీ గల్రాని ఖరీదైన బట్టలు, ఖరీదైన కెమెరా కనిపించలేదని, అవి కనిపించకుండా పోయిన రోజు ధనుష్ కూడా పరారీలో ఉండటంతో అతనే దొంగతనం చేసినట్లు ఆమె భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నైలోని రాయపేట లో నిక్కీ గల్రాని ఇంట్లో పని చేస్తున్నాడు ధనుష్.ధనుష్ పై ఫిర్యాదు చేసిన ఆమె వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తిరుపూర్ లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్న ధనుష్ ని గుర్తించారు.ధనుష్ ని అరెస్టు చేసి అతను దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక విచారణ నిమిత్తం ధనుష్ ని చెన్నైకి తీసుకొని వచ్చారు.దొంగతనం చేసిన దుస్తులు కెమెరాను తిరిగి నిక్కీ గల్రాని కి అప్పగించారు పోలీసులు.

ఇక వెంటనే ఆమె ఫిర్యాదుని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.ధనుష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరినట్లు సమాచారం.

ఎందుకంటే తన వస్తువులు తనకు తిరిగి దొరికాయి అన్న సంతృప్తి చాలని నిక్కీ గల్రాని పేర్కొంది.దొంగతనం చేసిన వస్తువుల ధర దాదాపుగా లక్షకు పైగా ఉంటుందని అంచనా.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube