ప్రైవేట్ ఆసుపత్రులు అనగానే వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే తప్ప రోగుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు.ప్రభుత్వ ఆసుపత్రుల కంటే కూడా కొన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తుండడం తో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు.
అలాంటి ఒక ప్రయివేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఒక పసిగుడ్డు బలైన ఘటన యూపీ లో చోటుచేసుకుంది.యూపీ లోని అలీగఢ్ లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వెలుగు లోకి రావడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే…యూపీ లో అలీగఢ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అదే ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ అనే వ్యక్తి భార్య స్వప్నా దేవి ప్రసవ వేదనతో గత ఆదివారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది.అయితే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో స్వప్నా దేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే శిశువు జన్మించిన తరువాత మృతి చెందింది అంటూ స్వప్నా దేవి కుటుంబ సభ్యులకు తెలపడం తో వారంతా కూడా విలపించారు.అనంతరం విషయం తెలుసుకున్న స్వప్నా దేవి కూడా గుండెలవిసేలా విలపించింది.
అయితే మృతి చెందిన బిడ్డను చూపించాలి అంటూ వారంతా కోరడం తో ఆసుపత్రి సిబ్బంది బిడ్డను గుడ్డ ముక్కల్లో చుట్టి తీసుకువచ్చి స్వప్నా దేవి, అలానే ఆమె కుటుంబ సభ్యులకు చూపించి అనంతరం బిడ్డ మృతదేహాన్ని డీప్ ఫ్రిజ్ లో దాచేశారు.అయితే ఆ మర్నాడు తమకు ఆ శిశువు మృతదేహాన్ని మాకు అప్పగించండీ ఖననం చేస్తామని రాజేశ్ కుమార్ అడిగాడు.
దానికి శిశువు మృతదేహన్ని ఆసుపత్రి సిబ్బంది వారికి అప్పగించగా, ఆఖరిసారి బిడ్డను చూసుకుందామనుకున్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా దిగ్బ్రాంతి కి గురయ్యారు.విషయం ఏమిటంటే ఆ పసికద్దు మృతదేహాన్ని ఎలుకలు కోరికనట్లు గా గుర్తించిన కుటుంబ సభ్యులు అసలు విషయం తెలిసొచ్చింది.
తమ బిడ్డ పుట్టిన వెంటనే చనిపోలేదేని హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బిడ్డను ఎలుకలు కొరికి తినేటయం వల్ల చనిపోయిందంటూ వారు గుర్తించి వెంటనే ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.అయితే వారు ప్రశ్నించడం తో సిబ్బంది దురుసుగా సమాధానం చెప్పారు.
ఫీజు ఎగ్గొట్టటానికి మాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు అంటూ ఎదురు తిరిగి బాధిత తల్లిదండ్రులతో గొడవకు దిగారు.దీనితో సిబ్బందితో వాగ్వివాదానికి దిగిన రాజేష్ కుమార్ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో విచారణ ప్రారంభించారు.
అయితే ఈ కేసును 24 గంటల్లో తేల్చాలి అంటూ ఆ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ కూడా ఆదేశాలు జారీ చేయడం తో ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరిగిపోతుంది.చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఎలుకలు పీక్కుతిన్న ఘటనలు చాలానే చూశాం, కానీ ఇలా ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మాత్రం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది.