న్యూజిలాండ్‌లోని హెల్ పిజ్జా( Hell Pizza ) అనే పిజ్జా చైన్ “ఆఫ్టర్ లైఫ్ పే”( AfterLife Pay ) అనే ఒక విడ్డూరమైన ఆఫర్ ప్రకటించింది.“బయ్ నౌ పే లెటర్” అనే ఒక పేమెంట్ విధానం ఈరోజుల్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.అయితే దీని నుంచే ప్రేరణ పొంది ఈ వింత విధానాన్ని కంపెనీ తీసుకొచ్చింది.ఈ విధానంలో కస్టమర్లు ఇప్పుడు పిజ్జాను కొనుగోలు చేసి, వారు చనిపోయిన తర్వాత దాని కోసం చెల్లించవచ్చు.
అదెలా అని బుర్ర గోక్కుంటున్నారా.అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే.
ఆఫ్టర్‌లైఫ్ పే ప్రోగ్రామ్ కోసం హెల్ పిజ్జా కంపెనీ న్యూజిలాండ్( New Zealand ) నుంచి 666 మందిని, ఆస్ట్రేలియా ( Australia ) నుంచి 666 మందిని ఎంపిక చేస్తుంది.ఈ సెలెక్టెడ్ కస్టమర్లు వారి వీలునామాపై చట్టపరమైన సవరణపై సంతకం కలిసి ఉంటుంది.
ఇక వారి మరణానంతరం వారి పిజ్జా ధరను కంపెనీ వసూలు చేస్తుంది.ఈ ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుంది.
ఇక వడ్డీ లేదా ఎక్స్‌ట్రా రుసుములు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు.
ఈ ఆఫర్ వ్యంగ్యంగా అనిపించినా ప్రజలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పద్ధతిని తాము అనుసరించమని కంపెనీ చెబుతోంది.హెల్ పిజ్జా సీఈఓ బెన్ కమ్మింగ్ మాట్లాడుతూ, సాధారణ స్కీమ్‌ల కారణంగా ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.పెరుగుతున్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆఫ్టర్‌లైఫ్ పేని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
దేశ జీవన వ్యయ సంక్షోభం కారణంగా మొదట న్యూజిలాండ్‌లో ప్రవేశపెట్టబడిన ఈ ఆఫర్ తరువాత ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు కూడా విస్తరించబడింది.ఆసక్తి ఉన్న వ్యక్తులు హెల్ పిజ్జా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆఫ్టర్‌లైఫ్ పే ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.