ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 24వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ప్రస్తుత గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఈనెల 21న వీడ్కోలు పలకనున్నారు.
ఫిబ్రవరి 22వ తారీకు రాత్రి కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్… విజయవాడ గవర్నర్ నివాసానికి చేరుకోనున్నారు.ఆ తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున ప్రమాణస్వీకారం చేస్తారు.
ఇదిలా ఉంటే మంగళవారం గవర్నర్ బిశ్వ భూషణ్ వీడ్కోలు సభ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ…గవర్నర్ బిశ్వ భూషణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తండ్రిగా పెద్దగా ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలిచారని కొనియాడారు.ఆయన విద్యావేత్త, న్యాయాన్నిపుణులు వీటన్నిటిని మించి స్వాతంత్ర సమరయోధులు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 95 వేల మెజార్టీతో గెలిచి.
ఒడిస్సా రాష్ట్రంలో రికార్డు సృష్టించారు.నాలుగు సార్లు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది.ఇంకా ఆయన గురుంచి అనేక విషయాలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహకరించిన ఆయనకి భగవంతుడు దయ ప్రజలందరి దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని.ప్రజలందరికీ మరింత సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో చత్తిస్ ఘడ్ గవర్నర్ గా వెళ్తున్నందుకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.