సింగర్ గీత మాధురి ( Singer Geetha Madhuri ) అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు.ఈమె తన సంగీతంతో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ఎంతోమంది జనాలను అట్రాక్ట్ చేసి వేలాది మంది అభిమానులను సంపాదించింది.
అలాంటి సింగర్ గీతా మాధురి సినీ నటుడు అయిన నందు ( Nandu ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.
అయితే గత రెండేళ్ల నుండి గీతామాధురి నందు ఇద్దరు విడిపోతున్నారని,వీరి మధ్య గొడవలు రావడం వల్ల గీత మాధురి తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందని,నందు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని, అందుకే ఇద్దరు కలిసి ఏ ఫంక్షన్ లో కూడా జంటగా కనిపించడం లేదు అని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో వైరలయిన సంగతి మనకు తెలిసిందే.
మరి నిజంగానే గీతామాధురి నందు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారా.ఇద్దరు కలిసి ఫంక్షన్లకు ఎందుకు రావడం లేదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.నందు ఇప్పటికే హీరోగా,సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో రష్మి (Rashmi) హీరోయిన్ గా నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్( Bomma Blockbuster ) అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించినప్పటికీ ఈ సినిమా అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది.ఇక ప్రస్తుతం నందు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24( Mansion 24 ).
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalakshmi sharath kumar ) తో కలిసి నందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి వస్తున్న ప్రచారానికి తెర దించారు.నందు మాట్లాడుతూ.గత రెండేళ్ల నుండి నేను గీత మాధురి ఇద్దరు విడాకులు తీసుకుంటున్నామంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కానీ మేము క్లారిటీ ఇవ్వలేదు.ఇక మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అలాగే మేము చాలా రోజుల నుండి రియాల్టీ షోలకి కూడా వెళ్లడం లేదు అంటూ నందు తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు.
అలాగే మ్యాన్షన్ 24 సిరీస్ లో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇప్పటివరకు తనని కేవలం సాఫ్ట్ అలాగే లవర్ బాయ్ రోల్స్ లోనే చూశారు.కానీ ఇలాంటి నెగటివ్ పాత్రలో ఎప్పుడు చూడలేదని, కచ్చితంగా ఈ సిరీస్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటానని నందు చెప్పుకొచ్చారు.
ఇక నందు గీత మాధురి ( Geetha Madhuri )తో విడాకులు తీసుకుపోతున్నాడు అంటూ వస్తున్న వార్తలను ఖండించడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.