లక్ష్య పోస్టర్ విడుదల.. రియల్ క్రీడాకారుడి లుక్ లో నాగ సౌర్య !

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం సౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Naga Shaurya Lakshya Movie New Poster Released, Naga Shaurya, Lakshya Movie, New-TeluguStop.com

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.

ప్రస్తుతం నాగ శౌర్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో లక్ష్య సినిమా ఒకటి.

విలు విద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్ట్ లో సౌర్య లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇందులో నాగ శౌర్య రియల్ క్రీడాకారుడిలా ఉన్నాడు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సౌర్య ఇందులో పార్థు అనే క్రీడాకారుడు రోల్ లో నటిస్తున్నాడు.ఇప్పటికే లుక్ మొత్తం మార్చేశాడు సౌర్య.

జిమ్ లో శ్రమించి మరి మంచి ఫిజిక్ తో కనిపిస్తున్నాడు.ఈ పోస్టర్ లో శౌర్య ఒక స్టేడియంలో వెనుకకు తిరిగి ఉన్నాడు.చేతిలో బాణాలు పట్టుకుని గురి పెట్టేందుకు రెడీగా ఉన్నాడు.నాగ సౌర్య ఈ పోస్టర్ లో ఇండియా బ్లు జెర్సీ ధరించి వెనుక షర్ట్ మెస్ పార్థు ఇండియా 11 అని ఉంది.

ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకంక్షాలు చెబుతూ ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Telugu Kethika Sharma, Ketika Sharma, Lakshya, Lakshyasfriday, Naga Shaurya, Nag

ఈ సినిమాలో నాగ సౌర్య కు జంటగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఆర్చరీ నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా లక్ష్య సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube