Hair care tips : వారంలో ఒక్క‌సారైనా ఇలా చేస్తే బ‌ట్ట‌త‌ల‌కు దూరంగా ఉండొచ్చు!

చాలా మంది పురుషులు జుట్టు అధికంగా ఊడుతుంటే ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని తెగ భయపడుతూ ఉంటారు.అందులోనూ పెళ్లికాని అబ్బాయిల్లో బ‌ట్ట‌త‌ల భ‌యం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

 If You Do This At Least Once A Week, You Can Stay Away From Baldness! Baldness,-TeluguStop.com

ఈ భయం ఒత్తిడిని పెంచి జుట్టు మరింత రాలేలా చేస్తుంది.అయితే మొదట భయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే బట్టతలకు దూరంగా ఉండవచ్చు.

అదే సమయంలో హెయిర్ ఫాల్ కు సుల‌భంగా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ముందు రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఇలా క‌డిగిన అల్లం ముక్క‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుండి స్ట్రైన‌ర్ స‌హాయంతో అల్లం జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ ను వేసుకోవాలి.ఆ త‌ర్వాత‌ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు మందారం పువ్వుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని తల మొత్తానికి కాస్త మందంగా అప్లై చేసుకుని షవర్ క్యాప్‌ ధరించాలి.

Telugu Baldness, Care, Care Tips, Fall, Remedy-Telugu Health Tips

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం క్ర‌మంగా త‌గ్గు ముఖం పడుతుంది.బట్టతల రాకుండా ఉంటుంది.

అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య నుంచి సైతం విముక్తి లభిస్తుంది.కాబట్టి, త‌మ‌కు బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమో అని భ‌య‌పడేవారు త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube