అక్కినేని నాగ చైతన్య బీభత్సమైన సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.చాలా తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.తాజాగా తను నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది.
సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా జనాల నుంచి మంచి ఆదరణను అందుకుంది.అయితే ఓ వైపు సినిమాలతో పాటు కొన్ని ఇతర హాబీలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగ చైతన్యకు కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం.
చాలా సార్లు తన సోషల్ మీడియా వేదికగా పలు కార్లు, బైకుల గురించి చాలా విషయాలు చెప్పాడు కూడా.అయితే తనకు రేసింగ్ కార్లు అంటే మరీ ఇష్టం అని చాలా తక్కువ మందికి తెలుసు.
పలు రేసింగ్ లు చూడటానికి కూడా తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు.ఓ సారి ఫార్ముల వన్ రేసర్ డేవిడ్ కౌల్థార్డ్ ను కలిశాడు కూడా.
అంతేకాదు, తనకు ఎరుపు రంగు ఫెరారీ కారు కూడా ఉంది.దానితో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలోనూ పెట్టాడు.అటు ఫెరారీలో తన మాజీ భార్య సమంతాతో వెళ్తూ తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు.నాగ చైతన్యకు కార్లతో పాటు బైకులు అంటే కూడా చాలా ఇష్టం.
ఆటో వరల్డ్ బ్రస్సెల్స్ కు వెళ్లాడు.అక్కడ ఇష్టమైన బైకులను చూసి ఫోటోను సైతం తను షేర్ చేశాడు.
అటు తన బైక్ ను కూడా ఓ సారి పరిచయం చేశాడు.
అటు మనం, ప్రేమమ్ తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు.ఈ యేడాది నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ చేశాడు.ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.
అందుకు తగినట్లుగా కలెక్షన్లు మాత్రం రాలేదు.నాగార్జునకు ఈ ఏడాది కలిసి రాకపోయినా.
నాగ చైతన్యకు మాత్రం సినిమాల పరంగా కలిసి వచ్చింది.ఆయన నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది.