సన్యాసి ఆశ్రమంలో వేలకొద్ది పాములు వాటితో ఏం చేస్తున్నారంటే!

సాధారణంగా ఒక పామును చూస్తే భయంతో ఆమడ దూరం పారిపోతాము.అలాంటిది కొన్ని వేల సంఖ్యలో పాములను చూస్తే ఎలా ఉంటుంది.

 Myanmar Buddhist Monk Has Created Refuge Snakes,thailand, Snakes, Smuggling, Sav-TeluguStop.com

ఊహించుకుంటేనే వళ్ళు జలదరిస్తుంది.అలాంటిది ఒక బౌద్ధ ఆశ్రమంలో వేలకొద్ది పాములను పెంచుతున్నారు.

ఆశ్రమంలో కొన్ని రకాల పాములు, కొండచిలువలు మొదలైనవి ఆశ్రమంలో తిరుగుతూ ఉంటాయి.అలా ఆశ్రమంలో పాములను పెంచడానికి గల కారణాలు ఏమిటి? వాటితో ఏం చేస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం…

సాధారణంగా వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.ఇలాంటి అక్రమ రవాణాకు మాయన్మర్ కేంద్ర బిందువుగా ఉంది.అడవులలో స్వేచ్ఛగా సంచరించే ఈ పాములను పట్టుకొని చైనా, థాయిలాండ్ వంటి దేశాలకు అక్రమ రవాణా జరుగుతుంది.

అక్కడి ప్రజలు వాటిని ఆహారంగా తీసుకుంటారు.ఇలా వేల సంఖ్యలో పాములను ఆదేశాలకు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని విలాతా అనే బౌద్ధ సన్యాసి తెలుసుకుని కొన్ని వేల సంఖ్యలో పాములను తన ఆశ్రమంలో సంరక్షిస్తున్నారు.

మయన్మార్ లోని సీక్తా తుఖా టెటూ అనే బౌద్ధ ఆశ్రమంలో విలాతా అనే 69 ఏళ్ల బౌద్ధ సన్యాసి కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు మొదలైన పాములకు తన ఆశ్రమంలో రక్షణ కల్పిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు.అడవులలో స్వేచ్ఛగా తిరిగే వాటిని ఇలా అక్రమ రవాణా చేయడం ఎంతో దారుణమని ఆయన తెలిపారు.

అందువల్ల అక్రమ రవాణా జరుగుతున్న పాములను రక్షించడానికి అతను ప్రభుత్వాలు, స్థానికులతో మాట్లాడి వివిధ చోట్ల బంధించినటువంటి పాములకు తన ఆశ్రమంలో రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.

ఆ పాముల సంరక్షణ, బాగోగులు చూసుకొని వాటిని తిరిగి అరణ్యంలోకి వదులుతారు.

కానీ కొంతమంది వాటిని కూడా తిరిగి అక్రమ రవాణా ద్వారా తీసుకెళ్తున్నారని, ప్రభుత్వం ఇటువంటి అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలని ఆ సన్యాసి తెలిపారు.మనిషి తన స్వార్థం కోసం వన్య ప్రాణులను బలి తీసుకోకూడదని ఆయన తెలిపారు.

విలాత రక్షిస్తున్న పాములకు ప్రతి సంవత్సరం దాదాపు మూడు వందల డాలర్లు ఖర్చు అవుతుందని తెలిపారు.ఆ బౌద్ధ సన్యాసి తన మెడలో పాములను వేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube