సూర్య ప్రతాపం ముందు రషీద్ ఖాన్ ప్రయత్నం వృధా.. ముంబై ఘనవిజయం..!

ఐపీఎల్ లో తాజాగా ముంబై – గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ ను 27 పరుగుల తేడాతో చిత్తుచేసి ముంబై( Mumbai Indians ) ఘన విజయం సాధించింది.మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు లో ప్లేయర్లైన ఇషాన్ కిషన్ 31, రోహిత్ శర్మ 29 పరుగులతో శుభారంభం అందించారు.

 Mumbai Indians  Won By Defeating Gujarat By 27 Runs , Rashid Khan ,suryakumar Ya-TeluguStop.com

తరువాత సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav )గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.బౌండరీల వద్ద పరుగుల వరద పారించాడు.49 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 103 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.విష్ణు వినోద్ 30 పరుగులతో సూర్య కుమార్ కు అండగా నిలిచాడు.

దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.

Telugu Gujarat, Latest Telugu, Mumbai, Rashid Khan, Rohit Sharma, Sporst-Sports

తరువాత లక్ష్య చేధనకు గుజరాత్ జ( Gujarat Titans )ట్టు ఆరంభంలోనే పేలవ ఆట ప్రదర్శన చేసింది.జట్టు ఓపెనర్లు అయినా వృద్ధిమాన్ సాహ 2, శుబ్ మన్ గీల్ 6 పరుగులతో పెవిలియన్ చేరారు.మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాలుగు పరుగులు అభినవ్ మనోహర్ రెండు పరుగులతో ఘోరంగా విఫలమయ్యారు.

తరువాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన విజయ శంకర్ 29 పరుగులు, డేవిడ్ మిల్లర్ 46 పరుగులతో కాసేపు క్రీజు లో ఉండి పెవిలియన్ చేరారు.

Telugu Gujarat, Latest Telugu, Mumbai, Rashid Khan, Rohit Sharma, Sporst-Sports

చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ ( Rashid Khan )32 బంతుల్లో 79 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది.రషీద్ ఖాన్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోవడం గమనార్హం.

ఇంకొన్ని బంతులు ఉండి ఉంటే రషీద్ ఖాన్ లక్ష్యాన్ని చేదించే అవకాశం ఉండేది.చివరకు గుజరాత్ ఓటమిని చవిచూసింది.

ముంబై జట్టు విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన తమ జట్టు భారీ లక్ష్యాన్ని చేయడం, తర్వాత బౌలింగ్లో వరుస వికెట్లను తీయడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.

సూర్య కుమార్ గురించి మాట్లాడుతూ అతని కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తనకు తెలుసునని, ప్రతి మ్యాచ్ ఫ్రెష్ గా ప్రారంభించి, చివరి మ్యాచ్ గురించి ఆలోచించడని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube