ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను సృష్టించి ప్రేమ పేరుతో అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.తాజాగా పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి ఓ యువకుడు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందమైన ఆడపిల్లలకు ప్రేమ సందేశాలు పంపుతూ వారిని బుట్టలో వేసుకొని చివరికి తన కోరికలు తీర్చకపోతే ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తూ తన కామ వాంఛలను తీర్చుకుంటున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి ఓ యువకుడు సోషల్ మీడియాలో ఆరి తేరాడు.అయితే ఇతగాడు ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.
దీంతో సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తూ అమాయకపు ఆడపిల్లలకు కపట ప్రేమ సందేశాలు పంపుతూ వారిని బుట్టలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతికి కూడా ఇదేవిధంగా ప్రేమ సందేశాలు పంపుతూ బుట్టలో వేసుకొని తన కామ వాంఛలను తీర్చాలని బ్లాక్ మెయిల్ చేయ సాగాడు.
దీంతో యువతి తన కుటుంబ పరువు, ప్రతిష్టల గురించి ఆలోచించి కిక్కురుమనకుండా ఉండిపోయింది.కాగా చివరికి ఎలాగోలా తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించింది.
ఇందులో భాగంగా యువకుడు ప్రేమ పేరుతో చేస్తున్నటువంటి ఆగడాల గురించి పోలీసులకు సమాచారం అందించింది.దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు నిందితుడి పక్కా ఆధారాలతో సహా పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.
అంతేకాక ముక్కు మొహం తెలియని వారితో సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రేమ మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.