మనుష్యులు మూగజీవాలపై చేస్తున్న అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి.ఇటీవల టిక్‌టాక్ మోజులో కొందరు వ్యక్తులు మూగజీవాలను నానా చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
కాగా తాజాగా ఓ బర్రెను తమ సరదా కోసం పలువురు యువకులు అతి క్రూరంగా హింసించే ప్రయత్నం చేశారు.కానీ వారు చేసిన పనికి అప్పటికప్పుడే శిక్ష పడింది.
దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొంతమంది యువకులు రెండు ఎడ్లబండ్ల మధ్య పోటీ పెట్టేందుకు బర్రెలను వాటికి కట్టేసి, గట్టిగా వాటిని వెనక్కి నుండి కొడుతూ అరుస్తూ వాయువేగంతో దూసుకెళ్తున్నారు.
ఒక బండి ముందు వెళ్లిపోతుండటంతో వెనకాల ఉన్న యువకులు తమ బండి ఇంకా వేగంగా వెళ్లాలని బర్రెను అదేపనిగా కొడుతూ ఉన్నారు.దీంతో ఆ బర్రె ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది.
వేగంగా వెళ్తున్న సమయంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి బండి ఎక్కెలా అది చేసింది.దీంతో బండితో పాటు ఆ యవకులు ఎగిరి రోడ్డుకు అవతల గట్టిగా పడ్డారు.
ఇదంతా మరో వ్యక్తి వీడియో తీస్తుండగా ఆ బర్రె అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోయింది.కొంచెంలో నడుములు విరిగిపోయేంత పనైందని, వారు చేసిన దాష్టీకానికి సరైన శిక్ష పడిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కాగా బర్రె ప్రతీకారం మామూలుగా లేదని, వాళ్ల వెన్నుపూసలు జారిపోయుంటాయని ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.ఏదేమైనా మనం చేసే పనులకు కొన్నిసార్లు ప్రతిఫలం అప్పుడే ఉంటుందనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి.