ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.ఈడీ అదుపులో ఉన్న శరత్ చంద్రారెడ్డిని కలవడంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరణ ఇచ్చారు.
శరత్ చంద్రారెడ్డి తనకు వ్యక్తిగతంగా ఆత్మీయుడని తెలిపారు.తాను కష్టాల్లో ఉన్నప్పుడు శరత్ చంద్రారెడ్డి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించి, సహాయం చేయడం అలవాటని వెల్లడించారు.అందుకే శరత్ చంద్రారెడ్డిని స్నేహా పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
దాన్ని రాజకీయం చేయడం తగదని స్పష్టం చేశారు.